Doshi First Look | ‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్లో మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు విజయ్ ఆంటోని. తెలుగులో పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన విజయ్ ఆంటోని.. ‘సలీమ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. 2016లో వచ్చిన ‘బిచ్చగాడు’తో ఇక్కడి వారికి మరింత దగ్గరయ్యాడు. ఈ చిత్రం తర్వాత విజయ్ నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా విడుదలైంది. అయితే బిచ్చగాడు తర్వాత ఇప్పటివరకు ఆ స్థాయిలో ఈయనకు మరో హిట్టు పడలేదు. ప్రస్తుతం ఈయన చేతిలో ఏడు సినిమాలున్నాయి. అందులో ‘దోషి’ ఒకటి. సీ.ఎస్ ఆముదన్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లో విజయ్ ఒక చేతితో కర్రను పట్టుకుని మరో చేతిని జేబులో పెట్టుకుని గుబురు గడ్డంతో మాస్సీ లుక్‌లో ఉన్నాడు. విజయ్ వెనకాల తను ప్రజల అమాయకత్వాన్ని ప్రశ్నించాడు. తను ప్రజల మనసును గెలుచుకున్నాడు. తను ప్రజల కోసం పోరాడాడు. తను ప్రజల కోసం ఒంటరిగా నిలిబడ్డాడు అంటూ ఓ కొటేషన్ రాసుంది. ఈ కొటేషన్ సినిమాపై క్యూరియాసిటిని పెంచుతుంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా నందితా శ్వేత, నంబెస్సాన్ రమ్య, మహిమా నంబియార్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇన్ఫినిటి ఫిలింస్ వెంచర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. క్రైమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
Here's the #DOSHIFirstLook #దోషి 🔥@csamudhan @gopiamar @editorsuresh @Mahima_Nambiar @nanditasweta @nambessan_ramya @FvInfiniti @bKamalBohra @Dhananjayang @lalithagd @pradeepfab @panbohra @Bhashyasree @DoneChannel1 @gskmedia_pr pic.twitter.com/4Ysa2LVb5s
— vijayantony (@vijayantony) July 24, 2022