Bimbisara Movie | ట్రెండింగ్‌లో ‘బింబిసార’ సెకండ్ సింగిల్
O Tene Palukula Video Song | కథా బలమున్న సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్. ఫలితం ఎలా ఉన్నా ప్రయోగాలు చేయడంలొ ఈయన ఎప్పుడు ముందుంటాడు. చాలా కాలం తర్వాత కళ్యాణ్‌రామ్ ‘118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు కమర్షియల్గానూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘బింబిసార’ ఒకటి. మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. ఫాంటసీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ఇస్తుంది.
ఈ చిత్రంలోని ‘ఓ తేనే పలుకుల’ అంటూ సాగే మెలోడీయస్ వీడియో సాంగ్ శనివారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటలోని సెట్సింగ్స్, క్యాస్టూమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కీరవాణి స్వర పరిచిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించిన ఈ పాటను హైమత్, సత్య యామిని ఆలపించారు. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈయన లుక్స్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్‌లు కథానాయికలుగా నటించారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించాడు.
Royal love of King #Bimbisara, is winning hearts ❤️#OTenePalukula video song is trending on YouTube with 2.5M views ❤️🔥
▶️ https://t.co/MMN5Ud9mJz@NANDAMURIKALYAN @CatherineTresa1 @DirVassishta @hymathmusic @SatyaYamini1 #VarikuppalaYadagiri @saregamasouth pic.twitter.com/LfhagDPNBj
— NTR Arts (@NTRArtsOfficial) July 24, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

