‘విజయాన్ని తలకెక్కించుకోకూడదు.. అపజయాన్ని మనసుకు తీసుకోకూడదు.. అలా చేస్తే అవి మనల్ని కిందకు లాగేస్తాయి. ఏ స్థాయిలో వున్నా నిలబడ్డ నేలను గౌరవించు. అదే నిన్ను ఉన్నతుడ్ని చేస్తుంది’ అని ఓ సందర్భంలో ముకేష్ అంబానీ నాకు చెప్పారు. దాన్ని తూచా తప్పక పాటిస్తున్నాను.
జీవితసారాన్ని బోధించి నాలో స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తి ముకేష్ అంబానీ’ అన్నారు రణ్‌బీర్‌కపూర్. గత ఏడాది సినిమా రంగానికి చేసిన కృషికిగాను ‘మహరాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు రణ్‌బీర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘నేను మంచి పౌరునిగా, కుటుంబం విషయంలో బాధ్యత గల ఫ్యామిలీ పర్సన్‌గా ఉన్నానంటే కారణం ముకేష్ అంబానీ సార్. ఆయన నాకు స్ఫూర్తి. ఈ రోజు నేను సమాజం గురించి ఆలోచిస్తున్నాను. పదిమందికి మంచి చేయాలని తాపత్రయపడుతున్నాను. లక్ష్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాను. నాలో ఈ మార్పులకు కారణం ఆయనే’ అంటూ కొనియాడారు రణ్‌బీర్‌కపూర్.