Ranbir Kapoor | యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘రామాయణ్’ కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దంగల్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం రణబీర్ ఇప్పటికే చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో రణ్‌బీర్ రాముడి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం రణ్‌బీర్ క్లీన్ షేవ్‌తో దర్శనమిచ్చాడు. సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ సినిమా కోసం మీసాలతో కనిపించిన రణ్‌బీర్ తాజాగా రామాయణ్ కోసం క్లీన్ షేవ్‌లో కనిపించడంతో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లుక్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో సౌత్ స్టార్ యష్ రావణుడుగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ముంబైలోని ఫిలింసిటీలో ‘రామాయణ్’ కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమాన్‌గా, లారా దత్తా కైకేయిగా, అరుణ్ గోవిల్ దశరథుడిగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.