ముంబై : యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన క్రమంలో చిత్ర టీం శనివారం సినిమా తారాగణానికి, సాంకేతిక సిబ్బందికి గ్రాండ్ పార్టీ (Animal Success Party) ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ పార్టీలో నటులు రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రీ, సందీప్ వంగా తదితరులు హాజరై సందడి చేశారు.
ఈ పార్టీకి రణ్‌బీర్ కపూర్ భార్య అలియా భట్, ఆమె తల్లితండ్రులు నీతూ కపూర్, మహేష్ భట్‌లతో కలిసి హాజర్యయారు. ఈ పార్టీలో రణ్‌బీర్, అలియాలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇక యానిమల్‌లో జోయా పాత్రలో కనువిందు చేసిన తృప్తి డిమ్రీ మెస్మరైజింగ్ డ్రెస్‌తో పార్టీలో అందరి దృష్టినీ ఆకట్టుకుంది.
Read More :