Ranbir – Alia Bhatt | బాలీవుడ్ ప్రేమ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్లు త్వరలోనే ఒకటి కాబోతున్నట్లు గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 14, 15వ తేదీల్లో వీరి పెండ్లి జరగబోతున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ పెండ్లికి రణ్‌బీర్ కపూర్ మాజీ ప్రియురాళ్లు కత్రినా కైఫ్, దీపికా పదుకొణె రానున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై అటు రణ్‌బీర్, ఇటు ఆలియా ఇద్దరూ స్పందించలేదు. ఈ క్రమంలో వీరి పెండ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది.
రణ్‌బీర్, ఆలియా ఇద్దరూ తమ పెండ్లిని సీక్రెట్‌గా జరుపుకోవాలని అనుకున్నారట. ఈ మేరకు ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఆ పెండ్లి తేదీ బయటకు లీకవ్వడంతో అందరికీ తెలిసిపోయింది. దీంతో గత వారం రోజులుగా రణ్‌బీర్, ఆలియా పెండ్లి టాపిక్ ట్రెండింగ్‌గా మారింది. ఈ క్రమంలో సెక్యూరిటీ దృష్ట్యా తమ పెండ్లిని ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఆలియా భట్ కజిన్ రాహుల్ స్పందించాడు. ‘నిజానికి వీరి పెండ్లి ఏప్రిల్ 14, 15వ తేదీల్లో జరపాలని అనుకున్నారు. అంతా బాగుంటే ఈ తేదీల్లోనే వారి పెండ్లి జరగాల్సింది. అయితే దీనిపై ఎంత గొప్యత పాటించిన ఇది బయటకు వచ్చింది. దీంతో సెక్యురిటీ దృష్ట్యా మెహందీ, హల్దీ, నుంచి మిగిలి కార్యక్రమాలన్నింటిలో మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20వ తేదీన పెండ్లి జరిగే అవకాశం ఉంది అంటూ’ ఓ ఛానల్ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు.