People Media Factory | తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న బ్యానర్ పేరు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory). హిట్టు, ఫ్లాప్ అనేది తేడా లేకుండా వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలనే కాకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంటోంది. ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ (Vishwa Prasad) తన టేస్ట్‌కు తగ్గట్టుగా అన్ని ఒక్క జానర్‌కే పరిమితం కాకుండా వివిధ రకాల జానర్లలో అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజాసాబ్, జీ2తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ బ్యానర్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘రణమండల’ (Ranamandala). ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ చూస్తుంటే హనుమంతుడి కథతో మైథాలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నటులు, దర్శకుడు సంబంధించి త్వరలోనే వివరాలను వెల్లడించనున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది.
As the winds rage and battles rise, Hanuman’s grace shields our – 𝐑𝐀𝐍𝐀𝐌𝐀𝐍𝐃𝐀𝐋𝐀 an epic mythological action journey is loading 🔥🔥
𝐇𝐀𝐍𝐔𝐌𝐀𝐍- 𝐓𝐡𝐞 𝐒𝐚𝐯𝐢𝐨𝐮𝐫 ❤️🔥@vishwaprasadtg @peoplemediafcy #VandanaPrasad #KrithiPrasad #Ranamandala#BhajeRudraRoopam pic.twitter.com/GwSYK1mlQo
— People Media Factory (@peoplemediafcy) October 26, 2024