Rana Naidu Web-Series | దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేసి కరన్ హన్షుమాన్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు. ఈ వెబ్ సిరీస్ అనౌన్స్ చేసినప్పటినుంచే ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ అంచనాలను డబుల్ చేశాయి. పైగా బాబాయి, అబ్బాయిలు కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో ప్రేక్షకులలో ఎక్కడలేని క్యూరియాసిటీ పెరిగింది.
ఇక ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ పూర్తయి నెలలు కావస్తుంది. కానీ స్ట్రీమింగ్కు మాత్రం నోచుకోలేకపోయింది. రేపో..మాపో స్ట్రీమింగ్ అవుతుందన్న టైమ్‌లో పోస్ట్‌పోన్ అంటే మేకర్స్ దగ్గబాటి ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన సందర్భాలెన్నో ఉన్నాయి. కాగా ఎట్టకేలకు రానానాయుడు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1:30 నిమిషాల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్‌లో మొత్తం పది ఎపిసోడ్లు ఉండగా.. ఒక్కో ఎపిసోడ్ 45-50 నిమిషాల నిడివిని కలిగి ఉన్నాయి. ఇక ఈ సిరీస్ తెలుగు, హిందీతో పాటు తమిళ్, మలయాళం, స్పానిష్ భాషల్లో అందుబాటులో ఉంది.