నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రానికి ‘35-చిన్న కథ కాదు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నందకిషోర్ ఈమాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘వినోద ప్రధానంగా తెరకెక్కించిన చక్కటి కుటుంబ కథా చిత్రమిది.
హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో పాటు కావాల్సినంత కామెడీతో ఆకట్టుకుంటుంది. నివేదా థామస్, ప్రియదర్శి పాత్రలను నవ్యరీతిలో తీర్చిదిద్దాం. వివేక్‌సాగర్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్‌సాగర్, సంభాషణలు: నందకిషోర్ ఈమాని, ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి, రచన-దర్శకత్వం: నందకిషోర్ ఈమాని.