SPY | టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ (Nikhil) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి స్పై (SPY). పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ చిత్రానికి పాపులర్ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం (డెబ్యూ) వహిస్తున్నాడు. ఐశ్వర్యా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఆర్యన్ రాజేశ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కే రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా స్టోరీ కూడా అందిస్తున్నాడు. కాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఈ చిత్రం యాక్టర్ దగ్గుబాటి రానా (Rana Daggubati)కు చాలా ప్రత్యేకం కానుందట. అదేంటి అనుకుంటున్నారా..? తాజా అప్డేట్ ప్రకారం స్పైలో రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే మేకర్స్ లాంఛ్ చేయబోతున్న థ్రియాట్రికల్ ట్రైలర్లో రానా పాత్ర గ్లింప్స్ ఉండబోతుందా..? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ ప్రాజెక్ట్‌లో రానా ఎలాంటి క్యారెక్టర్లో కనిపిస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది. దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
స్పై టీజర్లో మకరంద్ దేశ్‌పాండే భగవాన్ జీ ఫైల్స్ గురించి ప్రస్తావిస్తూ.. ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదాన్ని కవర్-అప్ స్టోరీగా పేర్కొంటాడు. భారత దేశ నిగూఢ రహస్యమైన నేతాజీ మరణం మిస్టరీని ఛేదించే బాధ్యతను స్పై (నిఖిల్) కు అప్పగిస్తాడు. ఈ క్రమంలో సాగే యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఉండబోతున్నట్టు టీజర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. స్పై చిత్రాన్ని కే రాజశేఖర్ రెడ్డి Ed Entertainments బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
నిఖిల్ స్పై టీజర్..