Rana Daggubati | టాలీవుడ్ యాక్టర్ రానా దగ్గుబాటి (Rana Daggubati) ఇటీవలే రానా నాయుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ టాలెంటెడ్ హీరో ఇప్పటికే తేజ (Teja)దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించాడు. పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడీ క్రేజీ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు ఉండబోతుందన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
రానా-తేజ కాంబోలో యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతుందని తాజాగా మరో అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా పోషించిన జోగేంద్ర పాత్రకు మించిన పవర్ ఫుల్ రోల్‌ను తేజ సిద్దం చేశాడని ఇన్ సైడ్ టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే షురూ కానుందట. టాప్ హీరో, దేవుడు, జంబ లకిడి పంబ లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట.
ఈ సినిమాలో ఓ ప్రముఖ మలయాళ హీరో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు మరో టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై రానా టీం క్లారిటీ ఇవ్వనుందని తెలుస్తోంది. మరి ఈ సారి రానాను ఎలా చూపించబోతున్నాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. తేజ ఇప్పటికే రానా సోదరుడు అభిరామ్ హీరోగా అహింస సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.