Rana Intresting facts about virataparvam | పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉండే అతికొద్ది మంది నటులలో రానా దగ్గుబాటి ఒకడు. మొదటి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఈయన నటించిన లెటెస్ట్ చిత్రం ‘విరాటపర్వం’. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్లను జరుపుతుంది. ప్రమోషన్లో భాగంగా మేకర్స్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్నారు.
తాజగా హీరో రానా ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. తన కెరీర్లో ఓ గొప్ప ప్రేమకథ తీశానని, స్క్రిప్ట్ చదువుతుంటే గుండు బరువెక్కినట్లుగా అనిపించిందని తెలిపాడు. ఇలాంటి కథ ఇప్పటివరకూ వినలేదని, ఇంత ప్రెజర్ ఎప్పుడూ తీసుకోలేదని రానా పేర్కొన్నాడు. 1990లో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో రానా నక్సలైట్ రవన్న పాత్రలో నటించాడు. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. నేషనల్ అవార్డు గ్రహిత ప్రియమణి భారతక్క పాత్రలో నటించింది.