Rami Reddy| విలనిజం ప్రదర్శించడం మాములు విషయం కాదు. కొన్ని సినిమాలలో కొందరు నటులు విలనిజం ప్రదర్శించి ఆడియన్స్‌తో చీవాట్లు తిన్నారు. అంటే వారి నటనకి ప్రేక్షకులు ఎంత కనెక్ట్ అయ్యారో అర్ధం అవుతుంది. అప్పట్లో రామిరెడ్డి అనే నటుడు కూడా తన విలనిజంతో మెప్పించాడు. ఆయనని చూస్తుంటేనే గుండెల్లో దడ పుడుతుంది. ఎన్నో సినిమాలలో నటించి తన విలనిజంతో అదరగొట్టిన రామిరెడ్డి చిన్న వయస్సులోనే క్యాన్సర్‌తో మరణించారు.250కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో మెప్పించారు రామిరెడ్డి. ఆయన చివరి చిత్రం ‘మర్మం’.
కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా 55 ఏళ్ల వయస్సుకే 2011లో ఆయన కన్నుమూశారు. వ్యాధి బారిన పడినప్పటి నుంచి రామిరెడ్డి చాలా నరకం చూశారు. గుర్తుపట్టేలేనంత మారిపోయిన ఆయన చాలాకాలం పాటు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొని చివరిగా 2011, ఏప్రిల్ 14న కన్నుమూశారు. అయితే 90వ దశకంలో రామిరెడ్డి తన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. అంకుశం మూవీతో నటుడిగా పరిచయం అయిన అందులో స్పాట్ పెడతా అనే డైలాగ్‌తో చాలా ఫేమస్ అయ్యారు. రామిరెడ్డి నటించిన తొలి మూవీనే బ్లాక్ బాస్టర్ అవ్వడంతో ఆయనని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కేవలం తెలుగు మాత్రమే కాదు అటు బాలీవుడ్లో సైతం సత్తా చాటారు. ఇక తమిళం, మలయాళం, కన్నడ, భోజ్‌పురి భాషల్లోనూ తన నటనతో అదరగొట్టారు.
250కిపైగా చిత్రాల్లో రకరకాల పాత్రలతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న రామిరెడ్డి సినిమాల్లోకి రాకముందు ఆయన ఓ ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే చనిపోయిన రామిరెడ్డి మళ్లీ తిరిగి వచ్చాడా అనే సందేహం ఇప్పుడు కొందరికి కలిగింది. అందుకు కారణం ఆయన పోలికలతో సేమ్ టూ సేమ్ ఉన్న వ్యక్తి తారసపడ్డాడు. ఓ హోటల్ పని చేస్తూ దోసెలు వేస్తున్న వ్యక్తి అచ్చం రామిరెడ్డి మాదిరిగానే కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. నెటిజన్స్ కూడా ఆ వ్యక్తిని చూసి అవాక్కవుతున్నారు. నిజంగానే రామిరెడ్డి పోలికలతో ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.