Ram Gopal Varma | ప్రఖ్యాత దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోన్న చిత్రం ‘శారీ’. ‘టూమచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి సమర్పకుడు కూడా రామ్గోపాల్వర్మే కావడం విశేషం. సత్యా యాదు, ఆరాధ్యదేవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గిరికృష్ణ కమల్ దర్శకుడు. రవివర్మ నిర్మాత. నవంబర్‌లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్జీవీ డెన్‌లో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.
ఇది నిజజీవిత సంఘటనల మేళవింపుతో తెరకెక్కుతోన్న సైకలాజికల్ థ్రిల్లర్ అనీ, ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయక మహిళలను మానభంగం చేసి, అతి క్రూరంగా చంపిన శారీ కిల్లర్ ఉదాంతానికి తెరరూపమే ఈ సినిమా అనీ, ఇందులో శారీ కిల్లర్‌గా సత్యా యాదు నటిస్తుండగా, తన అందంతో అతన్ని ఉన్మాదిగా మార్చిన అమ్మాయి పాత్రలో ఆరాధ్యదేవి కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. ఈచిత్రానికి కెమెరా: శబరి.