స్టార్ కాంబినేషన్ రాంచరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కలయికలో వస్తున్న చిత్రం ఆర్సీ 15 (RC15). పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ కొనసాగుతుంది. తాజా అప్ డేట్ ప్రకారం ఏపీలోని రాజమండ్రి, రంపచోడవరం ప్రాంతంలో ఆర్సీ 15ను చిత్రీకరిస్తున్నారు. లీడ్ యాక్టర్లు రాంచరణ్, అంజలి, శ్రీకాంత్, సముద్రఖని ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఈ షెడ్యూల్ తర్వాత టీం కాకినాడలో షూటింగ్ చేయనున్నారు. షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కొన్ని నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో ఎస్జే సూర్య విలన్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోండగా..నవీన్ చంద్ర, సునీల్, జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి సర్కారోడు, అధికారి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని ఇప్పటికే వార్తలు తెరపైకి రాగా..దీనిపై శంకర్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Shankar at #RC15 shooting today#RamCharan 🔥🔥
— Stranger Things™️ (@TheShakeland) October 10, 2022
దిల్ రాజు హోంబ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా..సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.
Read Also : Big B Project K Look | పవర్హౌస్లా బిగ్ బీ..ప్రాజెక్టు కే లుక్‌తో బర్త్ డే విషెస్
Read Also : Gundellona Song | ఓరి దేవుడా సాంగ్ అప్డేట్.. గుండెల్లోన లిరికల్ వీడియో
Read Also : Shikhar Dhawan | సినిమాల్లోకి శిఖర్ ధవన్ ఎంట్రీ.. వివరాలు చెప్పిన స్టార్ క్రికెటర్
Read Also : Ammu Trailer | ఐశ్వర్యలక్ష్మి కొత్త సినిమా.. గృహహింస నేపథ్యంలో అమ్ము ట్రైలర్
Read Also : Raghu Babu Look | రంగంపేట ప్రెసిడెంట్‌గా రఘుబాబు..జిన్నా నుంచి లేటెస్ట్ లుక్