రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నిర్మాణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ వెలువడింది. నేటి నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతున్నది. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. జనవరి నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని మేకర్స్ తెలిపారు.
ఓ వైపు షూటింగ్‌తో పాటు పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ అన్ని ఆటల్లో ప్రావీణ్యం కలిగిన ఆటకూలీ పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.