Ram Charan | రామ్‌చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ వారంలోనే మైసూర్లో షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారని తెలిసింది.
రామ్‌చరణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై అక్కడ కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కిస్తారని సమాచారం. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చెబుతున్నారు. ఏ.ఆర్.రెహహాన్ సంగీతాన్నందిస్తున్నారు. భారీ వ్యయంతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఇదిలావుండగా రామ్‌చరణ్ తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.