చిరంజీవి మాట కోసం కదిలివస్తున్న రామ్‌చరణ్.. సంతోషంలో కీర్తి సురేశ్

Good Luck Sakhi Pre release event | ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఏ చిన్న ఫంక్షన్ అయినా చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్తున్నాడు. పిలిచిన ప్రతి ఫంక్షన్‌కు హాజరై వారికి సపోర్ట్‌గా నిలుస్తున్నాడు. ఇప్పుడు కీర్తి సురేశ్ కోసం కూడా చీఫ్ గెస్ట్‌గా వెళ్లడానికి సిద్ధమయ్యాడు. గుడ్ లక్ సఖి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తానని మాట ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. సాయంత్రం ఈవెంట్ అనగా పొద్దున చిరంజీవికి కరోనా అని తెలిసింది. దీంతో ముందు నుంచి అనుకున్న ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. అయినప్పటికీ ఇచ్చిన మాట పోకూడదని తాను వెళ్లలేకపోయినా.. తనకు బదులు తన తనయుడు రామ్‌చరణ్‌ను పంపిస్తున్నాడు మెగాస్టార్.
షూటింగ్ నేపథ్యంలో రూపొందిన గుడ్ లక్ సఖి సినిమాలో కీర్తి సురేశ్ మెయిన్ రోల్లో నటిస్తోంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నగేశ్ కుకునూరు ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో కీర్తి సురేశ్ పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటించింది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలో సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు మెగాస్టార్ చిరంజీవిని ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పిలవాలని దర్శకనిర్మాతలు భావించారు. ఇదే విషయం చెబితే చిరంజీవి కూడా ఓకే చెప్పేశాడు.
చిరంజీవి తదుపరి చిత్రం భోళా శంకర్‌లో ఆయన చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తుంది. దీంతో కీర్తి సురేశ్ కోసం అని మరో ఆలోచన చేయకుండా ఈవెంట్‌కు వస్తానని మాటిచ్చాడు. కానీ చివరి నిమిషంలో మెగాస్టార్ కరోనా బారిన పడ్డాడు. ఇవాళ సాయంత్రం ఈవెంట్ ఉందనగా.. ఉదయమే కరోనా సోకినట్లు తెలిసింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలే ఉండటంతో హోం క్వారంటైన్‌లోనే ఉండిపోయాడు చిరంజీవి. దీంతో గుడ్ లక్ సఖి చిత్ర బృందం అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. చీఫ్ గెస్ట్ లేకుండా ఈవెంట్ ఎలా అని అయోమయంలో పడిపోయారు. దీంతో తనకు బదులు తన కొడుకుని చీఫ్ గెస్ట్‌గా పంపిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు గుడ్ లక్ సఖి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ మేరకు చిత్ర బృందం కూడా అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసింది.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవికి రెండోసారి కరోనా పాజిటివ్
భీమ్లా నాయక్‌లో కోతలు భారీగా ఉండబోతున్నాయా.. రన్ టైమ్ అంత తక్కువ!!
Keerthy Suresh: చెల్లెలు పాత్ర కోసం రెండు కోట్ల రెమ్యునరేషనా..!
Tollywood | ఈ హీరో ఎవరో గుర్తు పట్టగలరా..
Keerthy Suresh relaxing time | కీర్తిసురేశ్ ఎక్కడ రిలాక్స్ అవుతుందో చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

