Ram Charan Fan | ‘ఆర్ఆర్ఆర్’ తెచ్చిపెట్టిన క్రేజ్‌ను చెక్కు చెదరకుండా కాపాడుకోవాలని రామ్‌చరణ్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మధ్యలో ‘ఆచార్య’ వంటి అట్టర్ ఫ్లాప్ పడినా.. ఆ ప్రభావం రామ్ చరణ్‌పై ఏమాత్రం పడలేదు. ఎందుకంటే అప్పటికే శంకర్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమాను ప్రకటించడంతో అందరి చూపు దీనిపైనే ఉంది. కానీ ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలైందో కానీ.. ఎన్నో అవాంతరాలు చుట్టుముట్టాయి. మొదట్లో చక చక షూటింగ్ జరిగినప్పటికీ ‘ఇండియన్-2’ రాకతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. మొదట రెండు సినిమాలను సమాంతరంగా జరపాలని శంకర్ ప్లాన్ చేసుకున్నా.. అది కుదరలేదు. దాంతో ఎక్కువ టైమ్ ఇండియన్-2కు కేటాయించి.. మధ్య మధ్యలో గేమ్ చేంజర్ షూటింగ్‌ను జరుపుతూ వస్తున్నాడు.
ఇప్పుడొస్తుంది అప్పుడొస్తుందంటూ లీకుల రూపంలో తెలియడం తప్ప మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అదీ కాకుండా తాజాగా ఈ సినిమా 2025 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు రావడంతో మెగా అభిమానుల కోపంతో ఊగిపోతున్నారు. ఈ వార్తలతో చిరాకేసిన అభిమానులు ట్విట్టర్లో శంకర్‌ను, చిత్రయూనిట్‌ను ట్యాగ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కానీ ఎవరి నుంచి ఉలుకూ పలుకు లేదు. దాంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఓ అభిమాని సూసైడ్ లేఖ రాశాడు. మరో రెండు, మూడు రోజుల్లో గేమ్‌చేంజర్ రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటానని లేఖలో వెల్లడించాడు. అంతేకాకుండా తన చావుకు కారణం శంకర్, దిల్‌రాజు అని పేర్లు కూడా రాశాడు.
‘రామ్ చరణ్ వీరాభిమానిగా నేను గేమ్ ఛేంజర్ సినిమా కోసం రెండేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను. చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. కనీసం రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. సినిమా షూటింగ్ కూడా వాయిదా పడుతూ వస్తుంది. మీరు మరో మూడు రోజుల్లో సినిమా విడుదల తేదీని ప్రకటించకపోతే.. నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా చావుకు ప్రధాన కారణం డైరెక్టర్ శంకర్, దిల్ రాజు, SVC నిర్మాణ సంస్థ వారే. నా బాధను అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా. లవ్ యూ చరణ్ అన్నా.. నిన్ను చాలా మిస్ అవుతున్నా.. ఇట్లు బాబు గౌడ్’ అంటూ లేఖను రాశాడు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
దీనిపై కొందరు సినిమా కోసం అలా చేయడం తప్పని అంటుండగా.. మరి కొందరు మాత్రం ఇలా భయపెడితేనే మేకర్స్ నోరు విప్పుతారని అంటున్నారు. మరీ దీన్ని చూసైనా మేకర్స్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.
We, fans too have some emotions & that crossed the line, so Iam intimating with a gentle reminder for a harsh decision.@SVC_official #GameChanger #RamCharan pic.twitter.com/WawR9KiC2N
— Babu Goud (@RC_MSD_) September 29, 2023