Ramayana | సాయిపల్లవి, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ కలిసి నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. ఈ చిత్రాన్ని నితేశ్ తివారీ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 2026 దీపావళికి తొలిభాగం, 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అయితే తాజాగా ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ వైరల్‌గా మారింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ గింప్స్‌ను రేపు ఉదయం 11.30 గంటలకు దేశవ్యాప్తంగా 9 స్క్రీన్స్‌లలో విడుదల చేయబోతున్నారు. ఇందులో హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని పీసీఎక్స్‌లో ఫస్ట్ గ్లింప్స్ వదలనున్నారు. ఈ ఫస్ట్ గ్లింప్స్‌కి మీడియాతో పాటు ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేసి అందులో పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, అహ్మాదాబాద్, కోల్కత్తా, పూణే, కొచ్చి, ముంబై ల్లో ఈ స్క్రీనింగ్ ఉండబోతుంది.
ఏ.ఆర్.రెహమాన్‌తో పాటు హాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ ఈ చిత్రాన్ని సంగీతాన్నందించబోతున్నారు. ఈ సినిమాలో రావణ పాత్రలో నటిస్తున్నట్లు కన్నడ అగ్ర నటుడు యష్ ఇటీవలే ప్రకటించారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్, కైకేయి పాత్రలో లారా దత్తా నటించనున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో వేసిన భారీ సెట్లో జరుగుతున్నది.