Ram Charan| ఏంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పార్లమెంట్‌కి వెళుతున్నారా, ఇది నిజమా అని మీలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా. రియల్ లైఫ్‌లో కాదు కాని రీల్ లైఫ్‌లో పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నాడట రామ్ చరణ్. త్వరలో సినిమా షూటింగ్ కోసం యూనిట్ సభ్యులు ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తుంది. కథలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలను ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో చిత్రీకరించాల్సి ఉందట. అంతే కాకుండా జామా మసీదు పరిసర ప్రాంతాల్లోనూ సినిమా షూటింగ్ నిర్వహించేందుకు బుచ్చిబాబు ప్లాన్ చేయడంతో నిర్మాతలు పర్మీషన్స్ కూడా తీసుకున్నారని సమాచారం.
త్వరలోనే చరణ్‌తో పాటు కీలక నటీనటులు, సాంకేతిక నిపుణుల బృందం ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో, శివారు ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ వివిధ ఆటలు ఆడతాడని సమాచారం. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా అంటే ఒకే ఆట నేపథ్యంలో ఉంటుంది. కాని ఈ చిత్రంలో రామ్ చరణ్ పలు ఆటలు ఆడతాడట. ఆట కూలీ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారని వార్తలు వస్తుండగా, దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
ఇటీవలి కాలంలో ఎప్పుడూ చూడని వైవిధ్యభరిత కాన్సెప్ట్‌తో ఈ సినిమాని రూపొందించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా టీజర్‌ని రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో సినిమా టైటిల్‌ను రివీల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.