Skanda | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. రామ్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి స్కంద (Skanda). బోయపాటి శ్రీను (Boyapati Srinu) డైరెక్షన్లో RAPO20గా వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రీలీల, సయీ మంజ్రేకర్ మరో ఫీ మేల్ లీడ్‌రోల్స్ పోషిస్తున్నారు.
ఇటీవలే విడుదల ట్రైలర్ (Skanda Trailer) కు ఊహించని రీతిలో స్పందన రాబట్టుకుంటూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. స్కంద ట్రైలర్ 50 మిలియన్లకుపైగా వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ఓ స్పెషల్ పోస్ట్ కూడా అందరితో పంచుకున్నారు. స్కంద తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏదో ఒక పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంది. యూఎస్‌లో స్కంద మేనియా మామూలుగా లేదు.
స్కంద యూఎస్ఏలో 350 లొకేషన్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక్కడ స్కంద ప్రీమియర్స్ ఉండటం లేదని కొన్ని రోజుల క్రితం వార్తలు హల్ చల్ చేశాయి. అయితే అలాంటి దేమి లేదంటూ తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్డేట్ యూఎస్ మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. సినిమా విడుదలకు ముందు మేకర్స్ యూఎస్ఏలో స్పెషల్ ట్రైలర్ ఏమైనా రిలీజ్ చేస్తారా.. అనేది చూడాలంటున్నారు సినీ జనాలు. సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించడం ఖాయమని ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చెబుతోంది.
స్కంద నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. స్కంద చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన నీ చుట్టూ చుట్టూ, గండరబాయ్, డుమ్మారే డుమ్మారే పాటలు నెట్టింట వ్యూస్ పంట పండిస్తున్నాయి. తాజాగా ఎస్ థమన్ కంపోజిషన్‌లో వచ్చే పాటల్లో రామ్-శ్రీలీల ఇరగదీసే డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేయబోతున్నారని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.
#Skanda will be releasing in 𝟑𝟓𝟎+ 𝐋𝐎𝐂𝐀𝐓𝐈𝐎𝐍𝐒 across USA – Biggest Ever for our Ustaad @ramsayz
🔥🔥THEATRES LIST & Booking Update this weekend, stay tuned!
Overseas Release by @VarnikhaVisuals in association with @CharismaEntmt
Premieres on 𝟐𝟕𝐭𝐡 𝐒𝐄𝐏𝐓💥… pic.twitter.com/AFH3QKSuyT
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 14, 2023
స్కంద ట్రైలర్‌కు రికార్డు వ్యూస్..
A Massive Milestone!!❤️🔥#SkandaTrailer rage hits 50 Million+ Views on YouTube💥
– https://t.co/iCeVlangrt#SkandaOnSep28 in Telugu, Hindi, Tamil, Malayalam & Kannada!❤️
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens… pic.twitter.com/7niyRGB99n
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 7, 2023
స్కంద ట్రైలర్..
స్కంద టైటిల్ గ్లింప్స్..
డుమ్మారే డుమ్మా సాంగ్..
గండరబాయ్ సాంగ్..
నీ చుట్టూ చుట్టూ సాంగ్..