Ram | ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘‘పప్పీ షేమ్’’ అంటూ సాగిన ఈ పాట, తమాషా టోన్‌లో వినిపించే యూత్‌ఫుల్ లిరిక్స్ తో, పెప్పీ బీట్స్, మాస్ హంగులతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో రామ్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు, పాట మధ్యలో వచ్చే డైలాగ్స్ మరింత హైలైట్‌గా నిలుస్తున్నాయి. సంగీత దర్శకులు వివేక్ అండ్ మెర్విన్ సమర్పించిన మ్యూజిక్కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ పాటను రామ్ పోతినేని స్వయంగా పాడారు. ఇది ఈ సినిమాలో ఆయన పాడిన రెండో సాంగ్ కావడం విశేషం.
వీడియోలోని విజువల్స్, డాన్స్ మూమెంట్స్, క్యాచీ బీట్ అన్ని కూడా యూత్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ మ్యూజికల్ ప్రమోషన్లలో ఇది ఓ మేజర్ హైలైట్‌గా మారింది.’ఆంధ్రా కింగ్ తాలూకా’కు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మీద నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించి అలరించనున్నారు. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాకు సంగీతం: వివేక్ – మెర్విన్ అందిస్తున్నారు.
ఇప్పటికే మూవీకి సంబంధించి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ అయింది. ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇది చూశాక చాలా రోజులకు రామ్ మళ్లీ ఓ ప్రేమ కథలో నటిస్తున్నట్టుగా అర్ధమైంది. ఇన్నాళ్లు మాస్ మంత్రం జపిస్తూ వచ్చిన రామ్ ఈ సారి స్లిమ్ అండ్ క్లీన్ లుక్‌లో అమ్మాయిల మనసు దోచే మునుపటి రామ్ గా కనిపించబోతోన్నాడు. ఈ గ్లింప్స్‌లో సినిమా కాన్సెప్ట్ ఏంటో కూడా చెప్పినట్టు అనిపిస్తుంది. సినిమా థియేటర్.. టికెట్ల కోసం పలుకు బడిని వాడటం.. ఎమ్మెల్యే, పోలీస్ తాలుకా అంటూ టికెట్లు తీసుకుంటూ ఉండటం.. ఆంధ్రా కింగ్ సూర్య సినిమా అంటే మామూలు విషయమా? అని చెప్పడం.. మన హీరో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ అని చెప్పి.. ఆంధ్ర కింగ్ తాలుకా అని యాభై టికెట్లు తీసుకోవడవం వంటివి చూస్తుంటే ఇదొక ఫ్యాన్ బయోపిక్ అని అందరు ముచ్చటించుకుంటున్నారు.