‘చాలా ఏళ్ల తర్వాత నా సినిమాకు పూర్తిగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇదొక బ్యూటీఫుల్ స్టోరీ. వ్యక్తిగతంగా కూడా ఈ కథతో నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఒక స్టార్హీరో, ఆయన అభిమాని మధ్య ఉన్న బంధాన్ని, భావోద్వేగాలను ఇందులో గొప్పగా ఆవిష్కరించారు. ఇలాంటి ఎమోషన్ మన తెలుగు సినిమాకే సొంతం’ అన్నారు హీరో రామ్. ఆయన తాజా చిత్రం ‘ఆంధ్రకింగ్ తాలూకా’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మహేష్‌బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. మంగళవారం థాంక్స్‌మీట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ..ఈ సినిమా పదిమందిలో తొమ్మిది మందికి నచ్చిందని, హానెస్ట్ కంటెంట్‌తో సినిమా తీసే ధైర్యాన్నిచ్చిందని, లాంగ్న్ ఉండే చిత్రమవుతుందని అన్నారు. టీమ్ అందరం కలిసి ప్రేమించి చేసిన సినిమా ఇదని, కంటెంట్‌కు మంచి ప్రశంసలొచ్చాయని, మున్ముందు కలెక్షన్స్ పెరుగుతాయనే నమ్మకం ఉందని చిత్ర నిర్మాత వై.రవిశంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మహేష్‌బాబు పి, కథానాయిక భాగ్యశ్రీ బోర్సే పాల్గొన్నారు.