RAPO 22 | టాలీవుడ్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం రాపో 22 ( RAPO 22). మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం పీ మహేశ్ బాబు (Mahesh Babu P) డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా గురించి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వార్తలను షేర్ చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ లుక్‌తోపాటు మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సేను టీంలోకి స్వాగతం పలుకుతూ అప్డేట్స్ అందించారని తెలిసిందే.
మేకర్స్ తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని కెమెరా స్విఛాన్ చేయగా.. హనురాఘవపూడి క్లాప్ కొట్టాడు. తొలి సన్నివేశానికి వెంకీ కుడుములు గౌరవ దర్శకత్వం వహించాడు. త్వరలో షూటింగ్ షురూ కాబోతుందని తెలియజేశారు. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రాన్ని టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్టు కోసం ఎదురుచూస్తున్న రామ్‌కు మరి ఈ సినిమాతోనైనా బ్రేక్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
RAPO 22 మూవీ లాంచ్..
The journey of #RAPO22 begins with an auspicious pooja ceremony ✨
Blockbuster directors @megopichand switched on the camera, @hanurpudi gave the clap & @VenkyKudumula directed the first shot.
Young directors @ShivaNirvana & @pavansadineni graced the event and extended their… pic.twitter.com/8PtqhKSRpI
— BA Raju’s Team (@baraju_SuperHit) November 21, 2024
భాగ్య శ్రీ బోర్సేకు స్వాగతం..
The recent sensation #BhagyashriBorse joins #RAPO22 adding her charm and brilliance to the beautiful journey ❤️🔥
The journey begins with the pooja ceremony tomorrow ✨
Stay tuned!
Starring @ramsayz
Written and directed by @filmymahesh
Produced by @MythriOfficial.#RAPO pic.twitter.com/9XehPKydAO— Mythri Movie Makers (@MythriOfficial) November 20, 2024
Mahesh Babu | షూట్లో మహేశ్ బాబు ఫ్రెష్ లుక్.. ఇంతకీ క్రేజీ వార్తేంటో తెలుసా..?
Sarangapani Jathakam teaser | మీరు ఊహించని అద్భుతం జరుగుతోంది.. ప్రియదర్శి సారంగపాణి జాతకం టీజర్
Bhairavam | భైరవం షూటింగ్ టైం.. కోనసీమలో అదితీశంకర్తో బెల్లంకొండ శ్రీనివాస్
UI The Movie | ఉపేంద్ర యూఐ తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తుందెవరో తెలుసా..?
Dhanush | 2025 ఫస్ట్ హాఫ్‌ను టేకోవర్ చేసిన ధనుష్.. కుబేర సహా 3 సినిమాలు