Ram Pothineni Next Film | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాక్ టు బ్యాక్ కథలను ఓకే చేస్తూ సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ద్విభాష చిత్రం ‘ది వారియర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ దర్శకుడు ఎన్. లింగుస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ చిత్రం జూలై 14న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు.
ఈ చిత్రం తర్వాత రామ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే రామ్ పోతినేని 21వ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. బోయపాటితో సినిమా తర్వాత రామ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని సమాచారం. కాగా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్‌తో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించాడు. అయితే ఈ సినిమాకు చాలా సమయం పట్టేటట్లు కనిపిస్తుంది. దాంతో హరీష్, రామ్‌తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.