Ram Pothineni | ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ పోతినేని తనలోని మాస్ కోణాని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ను ఏర్పరుచుకున్న రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూర్తిగా మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు. గతేడాదిలో వచ్చిన ‘రెడ్’.. ఇటీవలే వచ్చిన ‘ది వారియర్’ చిత్రంలోనూ మాస్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలాగున్నా.. మాస్ ఆడియోన్స్‌లో మాత్రం మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం రామ్, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న స్కంద సినిమాపై జనాల్లో మాములు అంచనాల్లేవు. బోయపాటి వైలెన్స్ ఈ సారి ఊహించిన దానికంటే అరివీర భయంకరంగా ఉండబోతుందని గ్లింప్స్, ట్రైలర్లు గట్రా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాయి. ఇక బీ, సీ సెంటర్లకు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు కూడా చెప్పేశాయి. ముందుగా వినాయక చవితి వీక్ అనుకున్నా.. పలుకారణాల వల్ల రెండు వారాలు అంటే సెప్టెంబర్ 28కు సినిమాను పోస్ట్ పోన్ చేశారు. రేపు ఈ పాటికి థియేటర్లు దద్దరిల్లిపోతుంటాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రామ్ తెగ కష్టపడ్డాడని ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం రామ్ తన లుక్‌తో పాటు బాడీకి కూడా బాగానే పని చెప్పాడట. ఎంతలా అంటే క్యారెక్టర్ కోసం 12కిలోల బరువు పెరిగాడట. బాడీ షేప్ పర్ఫెక్ట్గా రావడానికి జిమ్‌లో తెగ కసరత్తులు చేశాడట. ఆయన డెడికేషన్‌కు స్కంద ఖచ్చితంగా పే ఆఫ్ అవుతుందని చిత్రయూనిట్ ధీమాగా ఉన్నారు. ఇక రామ్ సైతం తీరిక లేకండా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాకు ఇప్పటికే ఓ రేంజ్లో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. స్టార్ సంస్థ సౌత్‌లోని అన్ని భాషల నాన్-థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.50 కోట్లకు కొనుక్కుందని టాక్. ఇక ఈ సినిమాకు బిజెనెస్ కూడా భారీగానే జరిగింది. స్కంద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టాల్సి ఉంటుంది.
Ustaad @ramsayz's Remarkable Journey : From 72kgs to 84kgs for #Skanda 💪🏻💥
in an astonishing transformation, @ramsayz put in the hard work and dedication needed to bring his character in 'Skanda' to life. He gained an impressive 12kgs, going from 72kg to 84kg, showcasing his… pic.twitter.com/S3NkfbiRru
— Hari Ram (@Hariramhere) September 26, 2023