రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచారపర్వాన్ని వేగవంతం చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్‌దత్ ప్రతినాయకుడైన బిగ్బుల్ పాత్రను పోషిస్తున్నారు. గురువారం ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ‘బిగ్బుల్’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. విలన్ పాత్రలను పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు పూరి జగన్నాథ్ సిద్ధహస్తుడు.
బిగ్బుల్ పాట సంజయ్‌దత్ క్యారెక్టర్‌ను ప్రజెంట్ చేస్తూ సాగుతుందని చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా సంజయ్‌దత్ మాట్లాడుతూ..పూరి జగన్నాథ్ తెలుగు సినిమా డైనమిక్స్‌ను మార్చారని, బిగ్‌బుల్‌గా సినిమాలో తన పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారని, డబుల్ ఇస్మార్ట్ ప్రేక్షకులకు కావాల్సినంత జోష్‌ను పంచుతుందని అన్నారు.
డబుల్ మాస్, డబుల్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నామని హీరో రామ్ పోతినేని తెలిపారు. తాను సంజయ్‌దత్‌కి పెద్ద అభిమానినని, ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందని పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మికౌర్.