Ram Mandir Donation | అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర విరాళాల చోరీకి సంబంధించిన వివాదంపై బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రామ మందిరం విరాళాల కుంభకోణం అనేది చాలా చిన్న దొంగతనమని, మొఘలుల కాలంలో మన దేవాలయాలను లూటీ చేసి, బ్రాహ్మణులను చంపి, దేశ సంపదనంతా దోచుకున్నదే నిజమైన దొంగతనమని ఆయన ఇటీవలే పేర్కొన్నారు. ఆనాటి అంతటి పెద్ద విపత్తునే మనం అధిగమించినప్పుడు, ప్రస్తుత రామ మందిరం కుంభకోణం మనకు పెద్ద విషయమేమీ కాదంటూ అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ఇక అనుపమ్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో నెటిజన్లు, పలువురు రాజకీయ నాయకులు ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే, తనపై వస్తున్న విమర్శలపై అనుపమ్ ఖేర్ మరోసారి స్పందిస్తూ ఒక వీడియో ద్వారా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మెడలో కాషాయ కండువా ధరించి షేర్ చేసిన ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ ఎజెండాకు సరిపోనప్పుడు నిజాన్ని చూసి ఎక్కువగా భయపడతారని అన్నారు. కొద్దిరోజుల క్రితం రామ మందిరంలో జరిగిన దొంగతనం గురించి తాను పూర్తి నిజాయితీతో, బాధ్యతాయుతమైన భావంతో మాట్లాడానని, తాను అన్న ప్రతి మాటకూ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కొంతమందికి నిజం కంటే వివాదాలు సృష్టించడం, రచ్చ చేయడంపైనే ఎక్కువ ఆసక్తి ఉందని, అందుకే తన మాటలను వక్రీకరించి తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు. తాను గతంలో ఎప్పుడూ భయపడలేదని, ఈరోజు భయపడటం లేదని, భవిష్యత్తులోనూ భయపడబోనని తేల్చి చెప్పారు. ట్రోలర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా రాజకీయ నాయకులు ఎంత రచ్చ చేసినా తన వైఖరిని మార్చుకోబోనని స్పష్టం చేశారు. తనకు సరైనదనిపించిన దాన్నే మాట్లాడతానని, మిగిలిన వారు ఏమైనా చేసుకోవచ్చని అంటూ ‘జై శ్రీరామ్’ అని తన వీడియోను ముగించారు.
सच से लोगों को सबसे ज़्यादा डर तब लगता है, जब वह उनके एजेंडे के अनुकूल नहीं होता।
कुछ दिन पहले मैंने राम मंदिर में हुई चोरी के बारे में जो कहा, पूरी ईमानदारी और ज़िम्मेदारी से कहा। आज भी अपने हर शब्द पर कायम हूँ।
लेकिन कुछ लोगों को सच से ज़्यादा एक मुद्दा चाहिए होता है। उन्हें… pic.twitter.com/1U2kHJfzhG— Anupam Kher (@AnupamPKher) July 13, 2026