Cinema News | రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటిస్తున్న చిత్రం ‘వీక్షణం’. మనోజ్ పల్లేటి దర్శకుడు. పద్మనాభ సినీ ఆర్ట్స్ పతాకంపై పి.పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. ఆదివారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఓ రహస్య ఛేదనలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఆసక్తికరంగా సాగుతుంది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, దర్శకత్వం: మనోజ్ పల్లేటి.