JD Chakravarthy – MAnoj Bajpaye | అగ్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ చిత్రాలలో సత్య ఒకటి. ముంబై మాఫియా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం 1998లో విడుదలై సంచలన విజయం అందుకుంది. అప్పటివరకు మూసధోరణి కథలతో నెట్టుకోస్తున్న బాలీవుడ్‌కి అసలైన సినిమాను పరిచయం చేసింది. ఇక ఈ సినిమాలో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‌పాయ్ కథానాయకులుగా నటించగా… ఊర్మిళ మతోండ్కర్, షెఫాలీ షా హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ క్లాసిక్ చిత్రాన్ని రీ రిలీజ్ (Satya Re Release) చేయబోతున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు. జనవరి 17న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.
సత్య సినిమా కథ విషయానికి వస్తే.. ముంబైని అండర్ వరల్డ్ రూల్ చేస్తున్న సమయంలో బ్రతుకుదెరువు కోసం అక్కడికి అనాథగా వస్తాడు సత్య (జేడీ చక్రవర్తి). అయితే ఒక హోటల్లో పనిచేస్తున్న సత్యకి లోకల్ డాన్‌తో గొడవ జరగడంతో.. అతడు సత్యని జైలుకి పంపిస్తాడు. జైలులో ఉన్న సత్యకి అండర్ వరల్డ్ డాన్ భీకూ మాత్రే(మనోజ్ బాజ్ పేయ్)తో గొడవ జరుగుతుంది. అయితే సత్య ధైర్యాన్ని చూసిన భీకూ మాత్రే అతడితో స్నేహం చేయాలని చేతులు కలుపుతాడు. ఈ క్రమంలోనే ఇద్దరు జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ముంబాయి మహా నగరాన్ని ఎలా శాసించారు అనేది ఈ చిత్రం కథ.
Also Read..
Jan 17 th back in theatres 🔥 pic.twitter.com/4f48LJzzIj
— Ram Gopal Varma (@RGVzoomin) January 7, 2025