Ram Gopal Varma | సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) తన కెరీర్లో ఎన్నో ప్రయోగాలు చేసినా, ఈసారి అందరినీ ఆష్చర్యపరుస్తూ హీరోగా మారారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘షో మ్యాన్’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. Mad Monster అనే ట్యాగ్‌తో గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంపై రూపొందుతున్న ఈ సినిమాలో ఆర్జీవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా భారీ స్పందన వచ్చింది. గుబురు గెడ్డం, మాస్ అటిట్యూడ్‌తో పూర్తిగా రగ్డ్ లుక్‌లో కనిపించిన RGVని చూసి నెటిజన్లు “ఇది నిజంగానే ఆర్జీవీనా?” అంటూ ఆశ్చర్యపోతున్నారు. హీరోగా ఆయన ఎంట్రీ అదిరిపోతుందని స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా సీనియర్ నటుడు సుమన్ నటిస్తున్నారు. రజనీకాంత్ మూవీ ‘తలైవా’లో ఆదిశేషుగా నటించి ప్రేక్షకులను మెప్పించిన సుమన్, ఆర్జీవీతో విలన్‌గా పోటీపడడం సినిమాకు మరింత హైప్ తెచ్చింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు నూతన్ తెరకెక్కిస్తుండగా, భీమవరం టాకీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇదే బ్యానర్‌తో ఆయన ఐస్ క్రీమ్ 1, ఐస్ క్రీమ్ 2 సినిమాలు కూడా వర్మతో నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్ ప్రారంభమైంది మరియు వచ్చే సంక్రాంతికి ట్రైలర్ రిలీజ్ చేయాలని మూవీ టీం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
చిత్రబృందం సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోందని చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మొత్తం మీద దర్శకుడిగా ఎన్నో సెన్సేషన్లు క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతుండడంతో ‘షో మ్యాన్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్ గోపాల్ . మరి ఇంతకాలం దర్శకుడిగా చేసిన రామ్ గోపాల్ వర్మ హీరోగా ఏమేరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.