Ramcharan Next With Buchi Babu Sana | ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్‌చరణ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్‌చరణ్ నటనకు గ్లోబల్‌గా గొప్ప ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం చరణ్ లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘RC15’ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దిల్‌రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్, ‘జెర్సీ’ ఫేం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ ఈ ప్రాజెక్ట్ పలు కారణాల వల్ల ఆగిపోయింది. ఇదే కథను గౌతమ్, విజయ్‌తో తెరకెక్కిస్తున్నట్లు టాక్. దాంతో చరణ్ 16వ సినిమాకు దర్శకుడు ఎవరా అనేది గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.
తాజాగా ఈ చర్చలకు ముగింపు వచ్చింది. రామ్‌చరణ్ తన 16వ సినిమాను ‘ఉప్పెన’ ఫేం బుచ్చి బాబు సనా దర్శకత్వంలో చేస్తున్నాడు. బుచ్చిబాబు ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. నిజానికి ఉప్పెన తర్వాత బుచ్చిబాబు, తారక్‌తో సినిమా చేయాల్సి ఉంది. అయితే తారక్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో సినిమాలు కమిట్ అయ్యాడు. దాంతో బుచ్చి బాబు సినిమాకు ఆలస్యమయ్యేలా ఉంది. ఇప్పటికే బుచ్చి బాబు రెండేళ్లుగా ఏ ప్రాజెక్ట్ చేయలేదు. తారక్‌తో సినిమా చేయాలంటే ఇంకెన్ని రోజులు వేయిట్ చేయాలో అర్థం కాక, చరణ్‌ని లైన్లో పెట్టాడు. అయితే ఇది తారక్ కోసం రాసుకున్న కథ కాదని, కొత్త స్టోరీ అని సమాచారం. కాగా తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి విషయాలు తెలియనున్నాయి.
Sometimes, Revolt becomes a necessity ❤️🔥
Mega Power Star @AlwaysRamCharan & Sensational director @BuchiBabuSana team up for a powerful subject and a Pan India entertainer 💥 #RamCharanRevolts 🔥
Produced by @vriddhicinemas & @SukumarWritings
Presented by @MythriOfficial pic.twitter.com/XqfxyP7vpf
— Sukumar Writings (@SukumarWritings) November 28, 2022