Gamechanger | రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’ జనవరి 10న సంక్రాం తి కానుకగా విడుదలవుతున్న విష యం తెలిసిందే. దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఇంట్రడక్షన్ ఫైట్ గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ ఒక్క ఎపిసోడ్ కోసమే నిర్మాత దిల్‌రాజు కోట్లు ఖర్చు చేశారని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ట్రైన్లో వస్తున్న రామ్‌చరణ్‌ని రౌడీలు అటకాయించడంతో ఈ ఫైట్ మొదలవుతుందట.
రైలు పట్టాలపై జరిగే ఈ భారీ ఫైట్‌లో వందల సంఖ్యలో ఫైటర్లు పాల్గొన్నారని, సన్నివేశం డిమాండ్ మేరకు హెలికాప్టర్ని కూడా వాడారని సమాచారం. కథలో చాలా కీలకమైన ఎపిసోడ్ ఇదని ఇన్సైడ్ టాక్. చిరంజీవి ‘ఇంద్ర’ హెలికాప్టర్ ఫైట్‌ని గుర్తు చేసేలా ఈ ఫైట్ ఉంటుందని తెలుస్తున్నది. మెగా అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.