Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ అంది పుచ్చుకున్నాడు. ఈ చిత్రం తర్వాత గేమ్ ఛేంజర్ చేయగా, అది నిరాశ పరిచింది. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా రామ్ చరణ్‌కి పెద్ద హిట్ ఇస్తుందని అంటున్నారు. ఇటీవల గ్లింప్స్ విడుదల కాగా, ఇది మూవీపై భారీ అంచనాలే పెంచేసింది. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్‌కి సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటాయి. అవి ప్రేక్షకులకి కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.
రామ్ చరణ్ షూటింగ్స్ కోసం దేశ విదేశాలు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో తనతో పాటు కుక్కర్‌ని కూడా తీసుకెళతాడట. అదేంటి కుక్కర్‌ని తీసుకెళ్లడమేంటని మీకు కాస్త విచిత్రంగా అనిపించిన ఇది నిజం. ఇంత పెద్ద హీరో కదా కుక్కర్‌ను వెంట తీసుకెళ్లడం ఏంటి? కావాలంటే ఓ స్టార్ చెఫ్‌ను పెట్టుకోవచ్చు కదా అని చాలా మందికి డౌట్ రావచ్చు. దాని వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. రామ్ చరణ్ ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారాన్ని ఇష్టపడతాడు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ఒక్క పూట అయినా తను ఇంటి భోజనం తినాల్సిందేనట. లేదంటే ఫుడ్ విషయంలో కాస్త ఇబ్బంది పడతాడట.
అందుకే ఆయన సమస్యను తీర్చడానికి మెగా అత్తాకోడళ్ళు ఈ కుక్కర్ ప్లాన్ కనిపెట్టారట. తన తల్లి సురేఖ తయారు చేసిన ఇన్స్టంట్ మిక్స్‌తో కుక్కర్లో హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాడట రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ కోసమే సురేఖ ఇన్స్టంట్ మిక్స్‌లను తయారు చేయడం మొదలు పెట్టిందట. ఆ ఆలోచనతోనే ‘అత్తమ్మాస్ కిచెన్’ బిజినెస్‌ను స్టార్ట్ చేయడానికి నాంది పలికింది అని ఉపాసన ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు హోమ్ ఫుడ్ కోసం ఎంతో మంది ఆరాపటడుతుంటారు. ఎన్నో ఇబ్బందులని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు పొరుగింటి పుల్లకూర బాగానే ఉన్నా తర్వాత మొహం కొట్టేస్తుంది. అలాంటి వారి కోసమే ‘అత్తమ్మాస్ కిచెన్’ ను స్టార్ట్ చేశారు సురేఖ, ఉపాసన.