Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు పెద్ది కోసం బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నారు. “ఉప్పెన” సినిమాతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా, ఒక స్పోర్ట్స్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో, పోస్టర్లు మెగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ మాస్ లుక్, పవర్ఫుల్ ప్రెజెన్స్ చూసిన తర్వాత సినిమా మీద హైప్ మరింత పెరిగిపోయింది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్, ఫిజిక్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ట్రైనింగ్ సమయంలో తీసిన ఫోటోను షేర్ చేస్తూ,“Changeover for #PEDDI” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఆ ఫోటోలో చరణ్ గుబురు గడ్డం, రఫ్ హెయిర్‌స్టైల్, సిక్స్ ప్యాక్ బాడీతో హలీవుడ్ హీరో మాదిరి కనిపించారు. ఈ లుక్ చూసిన అభిమానులు “ఇది ఊర మాస్ అంతే!”, “పెద్ది బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతుంది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో హైలైట్. బుచ్చిబాబు డైరెక్షన్, చరణ్ మాస్ పవర్, రెహమాన్ మ్యూజిక్.. ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2025లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.‘పెద్ది’ నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్, ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్లు అభిమానుల్ని కట్టిపడేస్తాయని చెప్పొచ్చు. ‘పెద్ది’ కోసం రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్, మేకోవర్ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా మెగా హీరో కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందా? అనే ఉత్కంఠ ఇప్పుడు ఫ్యాన్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.