Ram Charan – Klin Kaara | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన గారాల పట్టి క్లీంకారతో ఫాదర్స్ డే జరుపుకున్నాడు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తన పిల్లలతో ఫాదర్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మహేష్ కూతురు సితార కూడా ఫాదర్స్ డే స్పెషల్ ఫొటో పంచుకుంది. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ కూడా తన కూతురు క్లీంకారతో ఫాదర్స్ డే జరుపుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి క్లీంకారను ఎత్తుకుని అలా గాల్లోకి ఎగరేస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్న ఫొటోను పంచుకున్నాడు రామ్ చరణ్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.