Game Changer | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game changer). ఆర్సీ15గా వస్తోన్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సోమవారం షురూ అయినట్టు అప్డేట్ కూడా బయటకు వచ్చింది. తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి విడుదలైన ఓ స్టిల్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. లొకేషన్లో శంకర్ సీన్ వివరిస్తుండగా.. రాంచరణ్ సూపర్ కూల్ లుక్‌లో శ్రద్దగా వింటుండటం తాజా స్టిల్‌లో చూడొచ్చు.
రాంచరణ్ ఇందులో డ్యుయల్ షేడ్స్‌లో కనువిందు చేయబోతున్నాడని అర్థమవుతోంది. తాజా షెడ్యూల్లో రాంచరణ్‌తోపాటు కీలక నటీనటులు పాల్గొంటున్నారని ఇన్సైడ్ టాక్. గేమ్ ఛేంజర్‌కు సంబంధించి వికారాబాద్, శంషాబాద్‌లో ఓ మినీ షెడ్యూల్ కూడా కొనసాగించనున్నారట. గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాజోలు భామ అంజలి మరో కీలక పాత్ర పోషిస్తోంది.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. రాంచరణ్ మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్సీ 16కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
షూటింగ్ లొకేషన్లో శంకర్, రాంచరణ్..
A SURESHOT #GAMECHANGER !! 🔥
This 💥❤️ pic.twitter.com/mmw1JR7cQi
— thaman S (@MusicThaman) October 10, 2023
కియారా అద్వానీతో శంకర్..