RC16 | ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు బుచ్చి బాబు సాన (Buchi Babu Sana). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మెగా హీరో రాంచరణ్ (Ram charan) హీరోగా RC16 తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్- వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడని తెలిసిందే. రాయనం పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తప్ప మరెవరూ నటించలేరు. బుచ్చి బాబు అద్భుతమైన కథ రెడీ చేశాడని.. రాంచరణ్ ఆర్సీ 16 ప్రాజెక్ట్ ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమన్నాడు విజయ్ సేతుపతి. మక్కళ్ సెల్వన్ తాజా కామెంట్స్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు రాంచరణ్ అభిమానులు.
బాక్సాఫీస్ వద్ద సుకుమార్, బుచ్చిబాబు, మైత్రీ మూవీ మేకర్స్, రాంచరణ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఆర్సీ 16పై అంచనాలు భారీగానే ఉన్నాయి. సుకుమార్ డైరెక్షన్లో రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి డైరెక్టర్ కావడంతో సూపర్ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. రాంచరణ్ కథానుగుణంగా ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడతాడట.
Great Actor ✅ identifies a Great Story ✅
BlockBuster in Making 💥💥 #RC16 💥💥#RamCharan 🦁👑 pic.twitter.com/fTzLAI0MYb
— Ujjwal Reddy (@HumanTsunaME) June 19, 2024