RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ (Game Changer)లో నటిస్తున్నాడని తెలిసిందే. ఆర్సీ 15గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా రాంచరణ్ అభిమానుల్లో జోష్ నింపే మరో వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana)దర్శకత్వంలో రాంచరణ్ 16వ (RC16) సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతుంది.
ఈ సినిమా పట్ల చాలా ఎక్జయిటింగ్‌గా ఉన్నానని.. ఇందులో తాను ఎంతోమందికి స్పూర్తి కలిగించే పాత్రలో కనిపించబోతున్నానని ఇటీవలే చెప్పాడు రాంచరణ్. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ విషయమేంటంటే.. ఆర్సీ 16లో రాంచరణ్ ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడాల్సి ఉండగా.. దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. అంతేకాదు రాంచరణ్ తన బాడీ లాంగ్వేజ్‌తోపాటు ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం కసరత్తులు చేయబోతున్నాడట. రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సారి ఏకంగా మెగాఫోన్ పట్టనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కిలారు వెంకట సతీశ్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్ నుంచి షురూ కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని సుకుమార్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించబోతున్నాడు. గేమ్ ఛేంజర్ సెట్స్‌పై ఉండగానే మరో సినిమా అప్డేట్ రావడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మెగా అభిమానులు.
Balagam | భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్కు ఫిదా.. బలగం ఖాతాలో మరో పురస్కారం
Gaami | విశ్వక్ సేన్ గామి అప్డేట్ ఇచ్చిన చాందినీ చౌదరి