RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఆర్సీ 15గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) దర్శకత్వంలో రాంచరణ్ 16వ (RC16) సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ బయటకు వచ్చింది.
తాజా అప్డేట్ ప్రకారం ఆర్సీ 16 రెగ్యులర్ షూట్ మార్చి రెండోవారం నుంచి షురూ కానుందని ఇన్సైడ్ టాక్. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై ఫిబ్రవరి లేదా మార్చిలో క్లారిటీ ఇవ్వనున్నారట. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఆర్సీ 16లో రాంచరణ్ ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడబోతున్నట్టు టాక్. కాగా దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది.
ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించబోతున్నాడు. రాంచరణ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్‌గా నిలిచిన రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గేమ్ ఛేంజర్ సెట్స్‌పై ఉండగానే ఆర్సీ 16 అప్డేట్ రావడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మెగా అభిమానులు.
ఆఫీస్ ప్రారంభోత్సవ ఫొటోలు..
The team of #RC16 from the office opening Pooja ❤️
Full fledged Pre-production underway💥
Mega PowerStar @AlwaysRamCharan @BuchiBabuSana @aryasukku @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/8pjGiCARC2
— Vriddhi Cinemas (@vriddhicinemas) August 27, 2023