Rangasthalam | జపాన్‌లో రాంచరణ్ రంగస్థలం మేనియా.. ఇన్నాళ్లకు ఏంటో స్పెషల్..?
Rangasthalam | స్టార్ డైరెక్టర్ సుకుమార్, రాంచరణ్ కాంబోలో వచ్చిన చిత్రం రంగస్థలం (Rangasthalam). బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. రాంచరణ్ (Ram Charan) కెరీర్లోనే ఉత్తమ నటనను కనబరిచిన సినిమాగా రికార్డులకెక్కింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
Rangasthalam | నేడు గ్లోబల్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan). కెరీర్లో ప్రత్యేకమైన రోజు. ఇంతకీ అంత స్పెషల్ ఏంటీ అనుకుంటున్నారా..? స్టార్ డైరెక్టర్ సుకుమార్, రాంచరణ్ కాంబోలో వచ్చిన చిత్రం రంగస్థలం (Rangasthalam). బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. రాంచరణ్ కెరీర్లోనే ఉత్తమ నటనను కనబరిచిన సినిమాగా రికార్డులకెక్కింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. రంగస్థలం నేడు జపాన్ (Japan)లో విడుదలైంది. అక్కడ ఓ థియేటర్లో జపనీస్ భాషలో డిజైన్ చేసిన రంగస్థలం పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
రంగస్థలం 2018 మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలతోపాటు వరల్డ్ వైడ్‌గా మొత్తం రూ.215 కోట్లకుపైగా గ్రాస్‌ను రాబట్టింది. ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాంచరణ్ తాజాగా రంగస్థలం విషయంలోనూ జపాన్ బాక్సాఫీస్ వద్ద ట్రెండింగ్‌లో నిలవడం ఖాయమంటున్నారు సినీ జనాలు. ఆర్ఆర్ఆర్ జపాన్‌లో అత్యధికంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా ఇప్పటికే రికార్డుల్లోకి ఎక్కింది.
మరి రంగస్థలం ఎలాంటి మేనియాను చూపిస్తుందో చూడాలంటున్నారు ట్రేడ్ పండితులు. సినిమాలో సెంటిమెంట్ సీన్లు, హీరో క్యారక్టరైజేషన్ జపనీస్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటునేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. రంగస్థలం కలెక్షన్ల పంట పండిస్తే.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఇక రాంచరణ్‌కు తిరుగులేదంటున్నారు సినీ జనాలు.
రంగస్థలం అనే గ్రామం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో చెన్నై సుందరి సమంత ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. జగపతిబాబు విలన్‌గా నటించగా.. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. అనసూయ భరద్వాజ్ మరో కీలక పాత్ర పోషించింది.
Mega Power Star #RamCharan‘s #Rangasthalam is ready for box office rampage in Japan🇯🇵 pic.twitter.com/1NyI1vVMJ6
— Manobala Vijayabalan (@ManobalaV) July 14, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

