Ram Charan | గేమ్ ఛేంజర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న చిత్రం పెద్ది. ఇటీవల మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది ఎన్నో అంచనాలు పెంచింది. పోస్టర్లో రామ్ చరణ్ రా, రగ్డ్ లుక్‌లో కనిపించి అదరగొట్టారు. ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ అయిందో అప్పటి నుండి కూడా మూవీకి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కొందరు రామ్ చరణ్ లుక్ రంగస్థలంలోని బుచ్చిబాబు పాత్రని పోలి ఉంది అంటే, మరి కొందరు పుష్పలో అల్లు అర్జున్ మాదిరిగా ఉందని అంటున్నారు. అయితే తాజాగా మూవీకి సంబంధించి మరో వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. చిత్రంలో రామ్ చరణ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడని అంటున్నారు.
అందుకు కారణాల కూడా చెబుతున్నారు. పోస్టర్లో రామ్ చరణ్ బ్యాటు పట్టుకొని ఉండగా, చేయి చాలా చిన్నగా కనిపిస్తుందని, దీనిని బట్టి చిత్రంలో రామ్ చరణ్ మరుగుజ్జుగా కనిపిస్తాడని కామెంట్ చేస్తున్నారు. సుకుమార్ మాదిరిగానే బుచ్చిబాబు కూడా తన సినిమాలలో హీరోకి ఏదో ఒక లోపం పెడుతున్నారుగా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. బుచ్చిబాబు గత చిత్రం ఉప్పెనలో హీరో పురుషాంగం కోసేసే సీన్ ఉంటుంది. ఇప్పుడు పెద్ది విషయంలోను బుచ్చిబాబు హీరోకి ఓ లోపాన్ని చూపించబోతున్నాడని చర్చించుకుంటున్నారు. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
రంగస్థలంలో చెవిటి వ్యక్తిగా చరణ్ నటన గురించి ఎంతచెప్పినా తక్కువే. ఇప్పుడు పెద్దిలో చరణ్ మరుగుజ్జుగా కూడా ఇరగదీస్తాడని ముచ్చటించుకుంటున్నారు. శ్రీరామనవమికి వచ్చే గ్లింప్స్‌తో దీనిపై ఓ క్లారిటీ అయితే వస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, బాలీవుడ్ విలక్షణ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. బడ్జెట్ విషయంలో బుచ్చిబాబు కు నిర్మాతలు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అంటున్నారు.