పెద్ది ఓ ఆటకూలి. అన్ని ఆటలు ఆడగల సమర్థుడు. ఓ సందర్భంలో కుస్తీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇక ప్రత్యర్థుల్ని మట్టికరిపించడం తరువాయి అన్నట్లు పెద్ది రంగంలోకి దిగాడు. పహిల్వాన్ లాంటి దృఢకాయంతో అతను బరిలో చేసిన పోరును వెండితెర మీద చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. శుక్రవారం అగ్ర హీరో రామ్‌చరణ్ జన్మదినం సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘పెద్ది’ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. పానంతో సావుకు ఎదురెళ్లే ఆట’ అనే వాయిస్‌ఓవర్‌తో మొదలైన గ్లింప్స్ గూజ్బంప్స్ తెప్పించేలా ఉంది. సిక్స్‌ప్యాక్ బాడీ, ఇంటెన్స్ స్క్రీన్‌ప్రజెన్స్‌తో రామ్‌చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ హైలైట్‌గా నిలిచింది.
గ్లింప్స్ చివరి సన్నివేశంలో గదను పట్టుకొని హనుమంతుడిలా కనిపించిన తీరు శ్రీరామనవమి పర్వదినం తాలూకు ఆనందోత్సాహాల్ని ఆవిష్కరించింది. విజువల్స్‌తో పాటు ఏ.ఆర్.రెహహాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. చివరగా ‘చూడుమే..ఆటే నా పొగరు’ అంటూ ఉత్తరాంధ్ర యాసలో రామ్‌చరణ్ చెప్పిన సంభాషణ ఆయన పాత్ర తాలూకు ధృక్పథాన్ని తెలియజేసేలా ఉంది. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. జాన్వీకపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బోమన్ ఇరానీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాణ సంస్థ: వృద్ధి సినిమాస్, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.