Ramcharan New Look | రామ్‌చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. తండ్రికి తగ్గ తనయుడంటూ బాలీవుడ్ ప్రముఖులు చరణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. ప్రస్తుతం ఈయన సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘#RC15’ చేస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్ లుక్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఈ చిత్రం అమృత్‌సర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ వీడియో చరణ్ గడ్డంతో స్టైయిల్ హేయిర్ కట్టుతో కనిపిస్తున్నాడు. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో 50వ సినిమాగా తెరకెక్కుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సునీల్, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
A New Vibe , A New Hairstyle, A New Look and Definitely A New #RamCharan 🔥🔥#RC15 RAMpage ⏳#ManOfMassesRamCharan @AlwaysRamCharan pic.twitter.com/RE3umDJjjo
— SivaCherry (@sivacherry9) July 2, 2022