Ram Charan | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సినిమా మొదటి గ్లింప్స్, ‘చికిరి చికిరి’ సాంగ్ విడుదలైన తర్వాత ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రామ్ చరణ్‌కు జపాన్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. ఆ విషయం తాజా ఘటనతో మరోసారి నిరూపితమైంది. చరణ్‌ను ప్రత్యక్షంగా చూడాలని కొందరు జపాన్ అభిమానులు ప్రత్యేకంగా ఇండియాకు వచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న చరణ్ వారిని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి, వారితో సమయం గడిపారు. ఫోటోలు దిగారు, పలకరించారు. ఈ సందర్భంగా చరణ్ సింప్లిసిటీ, అభిమానులపై ఆయన చూపిన గౌరవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన గెశ్చర్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక రామ్ చరణ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది.ఇక ఇదిలా ఉంటే ‘పెద్ది’ టీమ్ త్వరలో దిల్లీకి బయలుదేరనుంది. అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించడానికి విస్తృతమైన ప్లాన్ రూపొందించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో కథకు ప్రధానమైన ఎమోషనల్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లను షూట్ చేయనున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డు సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. బుచ్చిబాబు సాన తొలి సినిమా ‘ఉప్పెన’ భారీ విజయాన్ని నమోదు చేసిన తర్వాత, ఆయన–రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చరణ్ లుక్, కథ నేపథ్యం, రెహమాన్ సంగీతం అన్నీ ఈ సినిమాను అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో ఒకటిగా నిలిపాయి.
Mega Power Star @AlwaysRamCharan met fans from Japan who travelled all the way to see him and spent some quality time with them. ❤️ 🤗#RamCharan #PEDDI pic.twitter.com/M7ulRrOlu1
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) December 8, 2025