Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించాడు. ప్రతి సంవత్సరం రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకుంటాడు అన్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక భావనలో ఉండడంతో పాటు మనసు ప్రశాంతగా ఉండడం కోసం రామ్ చరణ్ ప్రతి యేట మణికంఠుడి మాలను ధరిస్తుంటాడు.
అయితే ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర టీజర్‌ను నేడు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లాంఛ్ చేయనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ టీజర్ లాంఛింగ్ వేడుకకు గేమ్ ఛేంజర్ టీం అంతా బయలుదేరింది. తాజాగా రామ్ చరణ్ కూడా హైదరాబాద్ నుంచి లక్నో బయలుదేరాడు. ఇక రామ్ చరణ్ హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి వెళుతుండగా అయ్యప్ప మాలలో చరణ్ ఉన్న వీడియో బయటికి వచ్చాయి. కాగా ఈ వీడియోను మీరు చూసేయండి.
Ram Charan walks barefoot at airport as he heads to Lucknow for #GameChnagerTeaser launch pic.twitter.com/ZqYGzLTcod
— HT Entertainment (@htshowbiz) November 9, 2024