ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ బ్రహ్మానందం ‘నేను’ పేరుతో ఇటీవల తన ఆత్మకథను వెలువరించారు. ప్రస్తుతం ఈ పుస్తకానికి చక్కటి పాఠకాదరణ లభిస్తున్నది. బుధవారం ఈ ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని అగ్ర హీరో రామ్చరణ్కు బహూకరించారు బ్రహ్మానందం.
తన అత్యద్భుత జీవిత ప్రయాణాన్ని బ్రహ్మానందం ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారని, విలువైన జీవిత పాఠాలను అందించడంతో పాటు సరదాగా నవ్విస్తూ, అలనాటి సినిమా సంగతులను గుర్తుచేస్తూ ఆయన ఆత్మకథ మనోరంజకంగా సాగిందని రామ్చరణ్ ట్వీట్ చేశారు.