హీరో రామ్చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. వారి జీవితాల్లోకి ఓ చిన్నారిని అహ్వానించనున్నారు. ఈ విషయాన్ని సోమవారం చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘శ్రీ హనుమాన్ ఆశీస్సులతో రామ్చరణ్, ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
2012లో రామ్చరణ్ ఉపాసన ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా సంతానం కోసం వీరు ఎదురుచూస్తున్నారు. పదేండ్లకు చరణ్, ఉపాసన నిరీక్షణ ఫలించింది. ఈ దంపతులకు సోషల్ మీడియా ద్వారా అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.