Sukumar | ప్రస్తుతం రామ్‌చరణ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. రామ్‌చరణ్ నటిస్తున్న 16వ చిత్రమిది. దీని తర్వాత ఆయన సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ సెట్స్‌మీదకు వెళ్లడానికి ఇంకా చాలా సమయ ఉంది. అయితే ఈ సినిమా జోనర్ గురించి సోషల్‌మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.
‘రంగస్థలం’ నుంచి ‘పుష్ప’ సిరీస్‌లోని రెండు చిత్రాల వరకు సుకుమార్ మాస్ కథలతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. దీంతో రామ్‌చరణ్ సినిమాకు ఆయన మళ్లీ మాస్ కథనే ఎంచుకుంటారా? లేదా కొత్త దారిలో వెళతారా అన్నది అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం న్యూఏజ్ యాక్షన్ డ్రామాగా సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలిసింది.
ఇందులో రామ్‌చరణ్ మోడరన్ లుక్స్‌తో కనిపిస్తారని, గ్లోబల్ ఆడియెన్స్‌కు చేరువయ్యేలా యాక్షన్, అడ్వెంచర్, రొమాన్స్ అంశాల కలబోతగా సుకుమార్ ఈ సినిమాను తీర్చిదిద్దబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.